National Dam Authority: ప్రాజెక్టుల భద్రతపై దృష్టి సారించండి
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:56 AM
ప్రాజెక్టుల భద్రతపై దృష్టి పెట్టాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచించింది. దీనిలో భాగంగా అథారిటీ బృందం రాష్ట్ర అధికారులతో సమావేశమై, శ్రీశైలం ప్రాజెక్టు పరిశీలనకు సిద్ధమవుతోంది
డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన
అమరావతి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యో తి): రాష్ట్రంలోని ప్రాజెక్టుల భద్రతపై దృష్టి సారించాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రభుత్వానికి సూచించింది. అథారిటీ చైర్మన్ అనిల్ జైన్, డైరెక్టర్ గిరిధర్‌లతో కూడిన బృందం సోమవారం విజయవాడకు వచ్చిం ది. సచివాలయంలో జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి,సాయిప్రసాద్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ కుమార్ తదితరులతో సమావేశమైంది. జైన్ బృందం మంగళవారం శ్రీశైలం ప్లంజ్‌పూల్ ప్రాంతాన్ని పరిశీలిస్తుంది.