Speaker Ayyannapatrudu: తిరుపతిలో మహిళా ప్రజాప్రతినిధుల జాతీయ సదస్సు
ABN , Publish Date - Jul 10 , 2025 | 04:24 AM
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులతో తిరుపతిలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
సెప్టెంబరు 14, 15ల్లో నిర్వహణ..ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులతో తిరుపతిలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సూచన మేరకు సెప్టెంబరు 14, 15 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ డిసెంబరు నాటికి రాజధాని ప్రాంతంలోని ప్రజాప్రతినిధుల క్వార్టర్లు పూర్తవుతాయని చెప్పారు.