గంజాయి, డ్రగ్స్ వ్యాపారుల గౌరవాధ్యక్షుడు జగన్: నక్కా
ABN , Publish Date - Jun 04 , 2025 | 06:42 AM
గంజాయి వ్యాపారులకు మద్దతు ఇవ్వడం జగన్ విధానం అంటూ టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ను గంజాయి మాఫియాకు గౌరవాధ్యక్షుడిగా నియమించొచ్చని ఎద్దేవా చేశారు.
గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలంటే జగన్‌కు రోజురోజుకీ కోపం పెరిగిపోతోంది. సీఎంగా చేసిన వ్యక్తి రౌడీషీటర్లకు, చైన్ స్నాచర్లకు, బ్లేడ్ బ్యాచ్‌లకు, గంజాయి వ్యాపారులకు మద్దతు ఇవ్వడం ఏమిటి? ఇలాంటి వ్యక్తి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ఎంతటి ప్రమాదకరమో ప్రజలు గ్రహించాలి. గంజాయి, డ్రగ్స్ వ్యాపారులు, బ్లేడ్ బ్యాచులకు జగన్‌ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే సరిపోతుంది’ అని ఆనంద్‌బాబు ఎద్దేవా చేశారు.