Municipal Elections: జూన్‌లో మునిసిపల్ ఎన్నికలు
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:30 AM
కోర్టు కేసులు పరిష్కారమయ్యాక స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు, రాజకీయ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం కాకినాడలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్వ యం సహాయక సంఘాల ద్వారా 26 మంది మహిళలకు మంత్రి ఎలక్ర్టిక్ స్కూటర్లను అందజేశారు.
మేలోపు కోర్టు లిటిగేషన్లు పరిష్కరిస్తాం
మూడేళ్లలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాం
టీడీఆర్ బాండ్ పెద్ద స్కామ్: మంత్రి పి.నారాయణ
రాజమహేంద్రవరం, కాకినాడ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మునిసిపాలిటీల పరిధిలో ఉన్న కోర్టు లిటిగేషన్లను పరిష్కరించి జూన్‌లో ఎన్నికలకు వెళతామని మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 21 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు, రాజకీయ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం కాకినాడలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్వ యం సహాయక సంఘాల ద్వారా 26 మంది మహిళలకు మంత్రి ఎలక్ర్టిక్ స్కూటర్లను అందజేశారు. ఆ స్కూటర్‌లను రాపిడోకు అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా ర్యాపిడో రైడర్లతో కలిసి మంత్రి స్కూటీ నడిపారు. అనంతరం కాకినాడలోనూ, రాజమహేంద్రవరంలోనూ ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.64వేల కోట్లతో టెండర్లు పిలిచామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల పనులు ఆలస్యమయ్యాయని, కోడ్ ముగిసినందున ఈ నెల 12, 15 తేదీల మధ్య పనులు వేగవంతం చేస్తామన్నారు. మూడేళ్లలో ప్రపంచంలోనే టాప్ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని చెప్పారు. ఏప్రిల్ 1నుంచి మునిసిపాలిటీల్లో వసూలుచేసే పన్నుల సొమ్మును ఆయా మునిసిపాలిటీల్లో అవసరాలకే వినియోగించుకోవచ్చన్నారు.
అసెంబ్లీ సమావేశాల తర్వాత రాజమహేంద్రవరం ప్రజాప్రతినిధులతో సమీక్షించి గోదావరి పుష్కరాలకు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. వైసీపీ అరాచకాలతో ఇబ్బంది పడిన టిడ్కో లబ్ధిదారులు వడ్డీ రద్దుచేయాలని కోరుతున్నారని, సీఎం దృష్టికి తీసుకెళ్లి రెండువారాల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. వైసీపీ హయాంలో రూ.85లక్షల టన్నుల చెత్త పోగుచేసి పో యారని, తొలగింపునకు టెండర్లు పిలిచామనిచె ప్పారు. అమరావతిలో 6,500 ఎకరాల భూమిని మినహాయించినట్టు జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందులో 2వేల ఎకరాలు కేంర ద సంస్థల నిర్మాణం కోసం, మిగతా వాటిలో రోడ్లు, డ్రెయిన్లు, సీవరేజి ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామన్నారు. స్వచ్ఛ ఏపీలో భాగంగా మునిసిపల్ చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
టీడీఆర్ బాండ్.. వెయ్యి కోట్ల స్కామ్
టీడీఆర్ బాండ్ పెద్ద స్కామ్ అని మంత్రి పి.నారాయణ అన్నారు. ఇది గత ప్రభుత్వం చేసిన భారీ స్కామ్ అని, దాదాపు వెయ్యి కోట్లపైనే ఈ స్కామ్ జరిగిందని చెప్పారు. దానిపై విజిలెన్స్, ఏసీబీ విచారణ జరుగుతోందని, రిపోర్టు వచ్చాక ఏ విధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటామన్నారు. నగరాలు, పట్టణాల్లో చెత్త పేరుకుపోవడానికి గత వైసీపీ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. డబ్బు లు చెల్లించకపోవడంతో చెత్త వాహనాలను నిలిపివేశారని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని తెలిపారు. వారికి ప్రత్యామ్నాయంగా కాంపెక్టర్స్ కొనుగోలు చేయనున్నామని మంత్రి తెలిపారు. మరో మూడు నెలల్లో చెత్త సమస్యకు పూర్తి పరిష్కారం లభించనుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో విశాఖపట్నం, గుంటూరుల్లో మునిసిపల్ చెత్త నుంచి విద్యుత్ తయారు ప్లాంట్లు ఏర్పాటు చేశామని, తర్వాత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మిగతా జిల్లాల్లో ప్రాజెక్టులు నిలిచిపోయాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం మళ్లీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోందన్నారు. నెల్లూరు, కాకినాడ-రాజమండ్రి మధ్య స్థల పరిశీలన కూడా పూర్తయ్యిందని, రాయలసీమలోనూ 2ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ
PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..
Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.