Share News

AP Panchayat Raj: ఎంపీడీవో ఖాళీలను భర్తీ చేయండి

ABN , Publish Date - Jun 26 , 2025 | 06:48 AM

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీడీవో పోస్టులను భర్తీ చేయాలని ఏపీ పంచాయతీరాజ్‌ అధికారుల సంక్షేమ సంఘం ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేసింది.

 AP Panchayat Raj: ఎంపీడీవో ఖాళీలను భర్తీ చేయండి

పంచాయతీరాజ్‌ అధికారుల సంక్షేమ సంఘం విజ్ఞప్తి

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీడీవో పోస్టులను భర్తీ చేయాలని ఏపీ పంచాయతీరాజ్‌ అధికారుల సంక్షేమ సంఘం ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేసింది. పలు మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఇన్‌చార్జులతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపింది. 2015 నుంచి ఎంపీడీవో పదోన్నతులు అడహాక్‌ విధానంలో ఇవ్వడం వల్ల రిటైర్‌ అవుతున్న ఎంపీడీవోలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ పోస్టులను రెగ్యులర్‌ చేయడం ద్వారా పే ఫిక్సేషన్‌కు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జడ్పీ సీఈవో పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు. సంఘం నేత కేఎన్‌వీ ప్రసాద్‌ వినతి పత్రాన్ని పవన్‌కల్యాణ్‌ ఓఎ్‌సడీ వెంకటకృష్ణకు అందించారు.

Updated Date - Jun 26 , 2025 | 06:48 AM