Share News

Zakia Khanam: బీజేపీలోకి జకియా ఖానమ్‌

ABN , Publish Date - May 15 , 2025 | 02:27 AM

వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ పార్టీకి రాజీనామా చేసి అనూహ్యంగా బీజేపీలో చేరారు. ముస్లిం మహిళల కోసం మోదీ తీసుకున్న చర్యలు తమను ఆకర్షించాయని ఆమె అన్నారు.

Zakia Khanam: బీజేపీలోకి జకియా ఖానమ్‌

మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌, వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌ బీజేపీలో చేరారు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆమె తన పదవులన్నింటికీ రాజీనామా చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో ఆమె భర్త అఫ్జల్‌ అలీఖాన్‌ కాంగ్రెస్‌ పార్టీలో బలంగా ఉండేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గుండెపోటుతో మృతి చెందారు. తరువాత ఆ కుటుంబం వైసీపీలోకి వెళ్లింది. జూలై 2020లో జకియా ఖానమ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వైసీపీ నాయకత్వం శాసనమండలి వైఎస్‌ చైౖర్మన్‌ హోదా కల్పించింది. ఆమెకు పద వి ఇచ్చారే కానీ.. అధికారాలు ఇవ్వకపోవడంతో పార్టీ నా యకత్వంపై కినుక వహించారు. 2023 నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 6 నెలల క్రితం టీటీడీ దర్శన టికెట్లు అమ్ముకున్నారంటూ ఖానమ్‌పై వైసీపీ సోష ల్‌ మీడియా ప్రచారం చేసింది. కొద్దిరోజుల క్రితం నారా లోకేశ్‌ను కలిశారు. దీంతో ఆమె టీడీపీలో చేరుతారని అం దరూ ఊహించారు. అనూహ్యంగా ఆమె బీజేపీలో చేరారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో అధ్యక్షురాలు పురందేశ్వరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జకి యా మాట్లాడుతూ, ట్రిపుల్‌ తలాక్‌ రద్దుతో ముస్లిం మహిళలకు అన్నలా మారిన నరేంద్ర మోదీ నిరుపేద ముస్లింల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. ప్రధాని చర్యలు ముస్లిం మహిళలకు సంతోషాన్ని కలిగించ డం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పురందేశ్వరి, మంత్రి సత్యకుమార్‌ వ్యాఖ్యానించారు.


రైతులకు మార్కెటింగ్‌ కీలకం: పురందేశ్వరి

నాణ్యమైన విత్తనాలు, సాగునీరు, మార్కెటింగ్‌ సౌకర్యా లు కల్పిస్తే కష్టించే రైతుకు ఎంతో ప్రయోజనకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. చిగురుపాటి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన కిసాన్‌ మోర్చా సమావేశంలో మాట్లాడారు. ఎన్నో ఆటంకాలు అధిగమిస్తూ వ్యవసాయం చేస్తున్న రైతులకు కేంద్రం అన్ని విధాలా సహకారం అందిస్తోందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 02:27 AM