Share News

High Court order: ప్రైవేట్‌ ఆస్పత్రిలో వంశీకి వైద్యం

ABN , Publish Date - May 31 , 2025 | 05:09 AM

ఆరోగ్య సమస్యలతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని హైకోర్టు ఆదేశాలతో ఆయుష్‌ ఆసుపత్రికి తరలించారు. పలు కేసుల్లో బెయిల్‌ పొందిన వంశీపై నకిలీ పట్టాల కేసులో బెయిల్‌ తిరస్కరించబడింది.

High Court order: ప్రైవేట్‌ ఆస్పత్రిలో వంశీకి వైద్యం

హైకోర్టు ఆదేశాలతో తరలించిన జైలు సిబ్బంది

విజయవాడ, మే 30 (ఆంధ్రజ్యోతి): విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయనను విజయవాడలోని ఆయుష్‌ ఆసుపత్రిలో జైలు అధికారులు చేర్పించారు. ముదునూరు సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో వంశీ అరెస్టయి జైలు పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఆయనపై పీటీ వారెంట్లు దాఖలయ్యాయి. టీడీపీ కార్యాలయంపై దాడి, గన్నవరంలో చెరువుల తవ్వకాలు, భూకజ్జా కేసుల్లో వంశీకి కోర్టులు బెయిల్‌ మంజూరు చేశాయి. గన్నవరం, బాపులపాడు మండలాల్లో గ్రావెల్‌ తవ్వకాలకు సంబంధించిన పీటీ వారెంట్‌ పెండింగ్‌లో ఉంది. ఇక నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ విచారణలో ఉండగానే తనకు అనారోగ్యంగా ఉందని వంశీ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. వంశీని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో ఆయనను జిల్లా జైలు నుంచి ఎస్కార్ట్‌తో తీసుకెళ్లి ఆయుష్‌ ఆసుపత్రిలో చేర్చారు.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 05:09 AM