SIT Police Block: 40 కార్లతో బయలుదేరి.. చివరికి ఒక్కకారుతో సరి
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:29 AM
మద్యం కేసులో సిట్ ముందు హాజరైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి భారీ బలప్రదర్శనకు దిగారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో వచ్చిన ఆయన...
బలప్రదర్శనను అడ్డుకున్న పోలీసులు.. ఇది నిలబడే కేసు కాదు: మిథున్
విజయవాడ, జూలై 19(ఆంధ్రజ్యోతి): మద్యం కేసులో ‘సిట్’ ముందు హాజరైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ‘భారీ బలప్రదర్శన’కు దిగారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో వచ్చిన ఆయన... గన్నవరం విమానాశ్రయం నుంచి మొత్తం 40 కార్లలో ర్యాలీగా సిట్ కార్యాలయానికి బయలుదేరారు. అయితే... పోలీసులు దశలవారీగా వాహనాలను అడ్డుకున్నారు. గూడవల్లి జంక్షన్‌కు వచ్చేసరికి 11 కార్లకు కుదిరించారు. రామవరప్పాడు సర్కిల్‌కు రాగానే మరో 9 కార్లను అడ్డుకున్నారు. చివరికి... మిథున్ రెడ్డి ఉన్న కారుతోపాటు మరో వాహనాన్ని మాత్రమే అనుమతించారు. అందులోనూ... మిథున్ రెడ్డి ఉన్న కారును మాత్రమే సీపీ కార్యాలయంలోనికి అనుమతించారు. దీనిని వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం నడుపుకొంటూ వచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి
Read latest AP News And Telugu News