Share News

Miss World 2025: సాగర్‌లో సుందరీమణుల సందడి

ABN , Publish Date - May 13 , 2025 | 04:12 AM

మిస్‌ వరల్డ్‌-2025 అందాల పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు నాగార్జునసాగర్‌, బుద్ధవనాన్ని సందర్శించి ఆనందించారు. వారిని గిరిజన నృత్యాలతో స్వాగతించి, బుద్ధవన ప్రత్యేకతలు వివరించగా, తరువాత వారు హైదరాబాద్‌, ఓరుగల్లు పర్యటనకు సిద్ధమవుతున్నారు.

Miss World 2025: సాగర్‌లో సుందరీమణుల సందడి

గిరిజన నృత్యంతో అందగత్తెలకు స్వాగతం

బుద్ధవనాన్ని సందర్శించిన భామలు

నేడు చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్‌

నల్లగొండ, మే 12(ఆంధ్రజ్యోతి): మిస్‌ వరల్డ్‌-2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు సోమవారం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ను సందర్శించారు. బుద్ధవనాన్ని చూసి ఆనందపరవశులయ్యారు. ఆసియా దేశాలకు చెందిన 22 మంది అందాల భామలు ప్రత్యేక బస్సులో సోమవారం సాయంత్రం 4:55 గంటలకు నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని విజయవిహార్‌ అతిథి గృహానికి చేరుకున్నారు. వారికి జిల్లా అధికార యంత్రాంగం ఘనస్వాగతం పలికింది. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం సాగర్‌ జలాశయం ఒడ్డున ప్రత్యేక ఫొటో షూట్‌లో వారు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు బుద్ధవనం చేరుకున్నారు. వారికి గిరిజన నృత్యంతో స్వాగతం పలకగా, బుద్ధ జయంతి సందర్భంగా బౌద్ధ భిక్షువులు ఆశీర్వచనం చేశారు. బుద్ధపీఠం వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం బుద్ధవనంలోని మీడియా పాయింట్‌ వద్దకు వచ్చి ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. బుద్ధవనం ప్రత్యేకతను, బుద్ధుని జీవిత విశేషాలను పర్యాటక శాఖ గైడ్‌ ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. రాత్రి 7.55 గంటలకు సుందరీమణులు హైదరాబాద్‌కు బయలుదేరారు. మంగళవారం హైదరాబాద్‌ నగరంలోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చార్మినార్‌ పరిధిలో మిస్‌ వరల్డ్‌-2025 హెరిటేజ్‌ వాక్‌, చౌమల్లా ప్యాలె్‌సలో వెల్‌కమ్‌ డిన్నర్‌ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సుందరీమణులు బుధవారం ఓరుగల్లు పర్యటనకు వెళ్తారు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 04:12 AM