Nurses Day: పవిత్రమైన వృత్తి నర్సింగ్
ABN , Publish Date - May 13 , 2025 | 04:40 AM
విజయవాడలో నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నర్సుల సేవలను ప్రశంసించారు. 5,300 నర్సింగ్ ఖాళీలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తామని, నర్సింగ్ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నర్సుల సేవలు అనితరసాధ్యం: మంత్రి సత్యకుమార్
విజయవాడ(వన్‌టౌన్), మే 12(ఆంధ్రజ్యోతి): చిత్తశుద్ధి, కరుణ, సానుభూతి, మానవత్వం, అంకితభావాలు కలబోసిన పవిత్రమైన వృత్తి నర్సింగ్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సోమవారం నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అత్యంత ప్రతిభ కనబరిచిన నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నర్సుల సేవలు అనితరసాధ్యమన్నారు. అయితే, కొన్నిచోట్ల ఉదాసీనంగా వ్యవహరించటంపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. హక్కుల గురించి మాట్లాడే నర్సులు తమ బాధ్యతలను కూడా గుర్తించాలన్నారు. రానున్న రోజుల్లో 5,300 నర్సింగ్ ఖాళీలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తామని చెప్పారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నర్సింగ్ కాలేజీలపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
For AndhraPradesh News And Telugu News