Share News

Street Dog Sterilization: వీధికుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

ABN , Publish Date - May 13 , 2025 | 05:15 AM

మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీధికుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను త్వరగా పూర్తిచేయాలని, వర్షాకాలం వచ్చేలోపు డ్రైన్ల పూడికతీత పూర్తి చేయాలని, అన్న క్యాంటీన్లలో ఆహారం నాణ్యతను నిరంతరం పరీక్షించాలన్నారు. అలాగే, పన్నుల వసూళ్లలో ఆలస్యం లేకుండా, తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు కొనసాగించాలని సూచించారు.

 Street Dog Sterilization: వీధికుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

త్వరగా పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశం

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): వీధికుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాలు పడే వరకు తాగునీటికి ఎక్కడా ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలను కొనసాగించాలన్నారు. వర్షాకాలం వచ్చే లోపు డ్రైన్ల పూడికతీత పూర్తి చేయాలని నిర్దేశించారు. తిరుపతి, విశాఖ, గుంటూరులో టీడీఆర్‌ బాండ్ల జారీని వేగవంతం చేయాలన్నారు. అన్న క్యాంటీన్లలో ఎప్పటికప్పుడు ఆహారం నాణ్యతను పరీక్షించాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో అలసత్వం లేకుండా ఆదాయంపై దృష్టి సారించాలని, ఛండీగఢ్‌ తరహాలో రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటాలని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:15 AM