Share News

Minister Narayana Clarifies: వర్మ ‘జీరో’ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ

ABN , Publish Date - Oct 17 , 2025 | 09:43 PM

పేటీఎం బ్యాచ్ చేసే అసత్య ప్రచారాలను తాను పట్టించుకోనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. నారాయణ వ్యాఖ్యలపై అభూత కల్పనలు ప్రచారం చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో తాను పిల్లర్ లాంటి వాడినని అన్నారు.

Minister Narayana Clarifies: వర్మ ‘జీరో’ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ
Minister Narayana Clarifies

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను జీరో చేశామనే వ్యాఖ్యలపై మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. తన మాటల్ని కట్ పేస్ట్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ శుక్రవారం మంత్రి నారాయణను వర్మ విశాఖపట్నంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ‘టెలీ కాన్ఫరెన్స్‌లో నేను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. నెల్లూరు నాయకులతో మాట్లాడుతూ పిఠాపురంలో ఉన్న సమస్యలను ప్రస్తావించాను.


పిఠాపురంలో జనసేన, టీడీపీ ద్వితీయ శ్రేణి మధ్య ఉన్న విభేదాలను చర్చించి ‘జీరో’ చేశామని నేను చెప్పాను. కంటెంట్ మొత్తం బహిర్గతం చేసి ఉంటే వక్రీకరణలు ఎలా జరిగాయో అర్థం అయ్యేది. వక్రీకరించి విభేదాలు సృష్టించడం ఎవరి వల్ల కాదు. ఎన్డీఏ కూటమి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇండిపెండెంట్‌గా 50 వేల ఓట్లతో గెలిచిన బలమైన నాయకుడు వర్మ. పిఠాపురంలో జనసేన, టీడీపీ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయి’ అని అన్నారు.


చంద్రబాబు ఆగమంటే ఆగుతా.. దూకమంటే దూకుతా..

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ.. నారాయణ వ్యాఖ్యలపై అభూత కల్పనలు ప్రచారం చేశారన్నారు. పేటీఎం బ్యాచ్ చేసే అసత్య ప్రచారాలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో తాను పిల్లర్ లాంటి వాడినని అన్నారు. మంత్రి నారాయణ జనసేన టీడీపీ మధ్య కాకినాడ జిల్లాలో వారధిగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి మధ్య విబేధాలు సృష్టించడం ఎవరి వల్ల కాదని తేల్చి చెప్పారు.


ఇవి కూడా చదవండి

మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపర్చడమే లక్ష్యం:పవన్ కల్యాణ్

మహాకూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వి.. కాంగ్రెస్ ఎంపీ వెల్లడి

Updated Date - Oct 17 , 2025 | 09:46 PM