Nara Lokesh: నారా లోకేష్ సంచలన కామెంట్స్..
ABN , Publish Date - Mar 04 , 2025 | 08:42 PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ పని మొదలైందని వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేష్.. రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతోందన్నారు.
అమరావతి, మార్చి 04: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ పని మొదలైందని వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి లోకేష్.. రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతోందన్నారు. రెడ్ బుక్ గురించి గతంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చే కార్యక్రమం మొదలైందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన ఎవరినీ వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా ప్రతీ ఎన్నికల్లో విజయం కూటమిదేనని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. 9 నెలల్లో అధికారంలోకి వచ్చినా.. 9 నెలల్లోనే కనీవిని ఎరుగని సంక్షేమం అందించినా.. ఆ ఘనత టీడీపీదేనని అన్నారు.
ఒక్కరోజు ఎమ్మెల్యే..
ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదని వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి లోకేష్. ఒక రోజు ఎమ్మెల్యేగా జగన్ ముద్ర వేసుకున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్షహోదా కోసం ఒకరోజు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగి బెంగుళూరు వెళ్లిపోతాడని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ఎదుర్కొన్న పట్టభద్రుల ఎన్నికలు గేమ్ చేంజర్‌గా మారాయని అన్నారు. 2023 పట్టభద్రుల ఎన్నికల్లోనే వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్ అయిందన్నారు. దేశానికి సంక్షేమం పరిచయం చేసింది ఎన్టీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. ఫించన్ పెంచినా, అన్న క్యాంటీన్లు ప్రారంభించినా, తల్లికి వందనం ప్రారంభించినా, రైతులకు అన్నదాతా సుఖీభవ కింద నిధులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అన్నీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పారు. యువత గెలిపించిన గెలుపు ఇది అని పేర్కొన్నారు. మార్చి నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.
Also Read:
లాలూ నావల్లే ఎదిగారు.. తేజస్విపై విరుచుకుపడిన నితీష్
For More Andhra Pradesh News and Telugu News..