Share News

Minister Kondapalli Srinivas : పారదర్శకంగా దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్‌: కొండపల్లి

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:29 AM

పింఛన్ల వెరిఫికేషన్‌ ఎంతో పారదర్శకంగా జరుగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

Minister Kondapalli Srinivas : పారదర్శకంగా దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్‌: కొండపల్లి

అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్‌ ఎంతో పారదర్శకంగా జరుగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎనిమిది లక్షల దివ్యాంగుల పింఛన్లు ఉండగా.. ఇప్పటివరకూ 1.20 లక్షల పింఛన్ల వెరిఫికేషన్‌ పూర్తయ్యిందన్నారు. గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే వెరిఫికేషన్‌ జరుగుతోందని, అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదన్నారు. ఎంఎ్‌సఎంఈల సర్వే 50 శాతం సర్వే పూర్తయ్యిందని, మార్చి 15 కల్లా పూర్తవుతుందని తెలిపారు.

Updated Date - Feb 21 , 2025 | 04:30 AM