Share News

Botsa Satyanarayana: బొత్సకు తమ్మినేనికి అస్వస్థత

ABN , Publish Date - Jun 05 , 2025 | 06:29 AM

మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఎండ తీవ్రతకు ఇబ్బంది పడ్డారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు. ప్రసంగం మొదలుపెట్టిన కొద్దిసేపటికే కిందకు ఒరిగిపోయారు.

Botsa Satyanarayana: బొత్సకు తమ్మినేనికి అస్వస్థత

వెన్నుపోటు కార్యక్రమంలో కుప్పకూలిన మాజీ మంత్రి

చీపురుపల్లి, టెక్కలి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినాయకత్వం పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఎండ తీవ్రతకు ఇబ్బంది పడ్డారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు. ప్రసంగం మొదలుపెట్టిన కొద్దిసేపటికే కిందకు ఒరిగిపోయారు. వెంటనే ఆయనను కారులో గరివిడిలోని బొత్స క్యాంప్‌ కార్యాలయానికి తరలించారు వైద్యులు పరీక్షలు చేసి..వడదెబ్బ తగిలిందని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం బొత్స విశాఖకు వెళ్లారు.

శ్రీకాకుళంలో తమ్మినేని...

శ్రీకాకుళంజిల్లాలో బుధవారం వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినం నిర్వహించాయి. ఇందిరా గాంధీ కూడలి నుంచి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వరకు కార్యకర్తలతో కలసి మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం నడుచుకుంటూ వెళ్లారు. వైసీపీ శ్రేణులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు గేట్లు మూసివేశారు. గేట్లు తోసుకుని కొందరు కార్యాలయంలోకి వెళ్లారు. ఈ క్రమంలో కొందరు తీవమ్రైన ఎండకు ఇబ్బంది పడ్డారు. గేటు వద్ద నిలబడిన తమ్మినేని సీతారాంకూ వడదెబ్బ తగిలింది.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 06:29 AM