రేప్‌లు చేసేవాళ్లు చిన్న పిల్లకాయలా
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:30 AM
గంజాయి తాగి పోలీసు కానిస్టేబుల్‌పై హత్యాయత్నం, అమ్మాయిలపై రేపులు చేసేవారు జగన్‌కు చిన్న పిల్లకాయలట. ఆయన మాటల్లో ఏమైనా అర్థం ఉందా?..
వారిని పరామర్శించడానికి సిగ్గుపడాలి: వెంకటరమణారెడ్డి
అమరావతి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ‘గంజాయి తాగి పోలీసు కానిస్టేబుల్‌పై హత్యాయత్నం, అమ్మాయిలపై రేపులు చేసేవారు జగన్‌కు చిన్న పిల్లకాయలట. ఆయన మాటల్లో ఏమైనా అర్థం ఉందా?’ అని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవల్‌పమెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణా రెడ్డి మండిపడ్డారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తెనాలి పిల్లకాయలపై పెట్టిన కేసులు దొంగ కేసులు అని జగన్ అంటున్నాడు. మరి ఆ పిల్లకాయలపై పెట్టిన కేసుల్లో కొన్ని జగన్ హయాంలోనే పెట్టారు. అవి కూడా దొంగ కేసులేనా? రేప్ చేసిన వాడిని, విద్యార్థి మీద హత్యాయత్నం చేసిన వాడిని పరామర్శిస్తాడా? జగన్‌రెడ్డికి సిగ్గుందా? జగన్‌పై 31 కేసులు ఉన్నాయి. ఆ కేసుల విచారణ మొదలై 5 వేల రోజులు అయింది. ఇప్పటికి 3,452 సార్లు కోర్టులో వాయిదాలు తీసుకోవడం ప్రపంచంలో ఓ రికార్డు. లీగల్ ఫీజుల కోసమే జగన్ రూ.6,904 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న జగన్‌రెడ్డి... ఎదురు చంద్రబాబును రోడ్డుమీద కొట్టాలంటూ మాట్లాడటానికి సిగ్గుండాలి. చంద్రబాబును రోడ్డుపై కొట్టాలంటున్న నిన్ను ఎక్కడ కొట్టాలి? దేనితో కొట్టాలో కూడా చెప్పు జగన్‌రెడ్డీ...’ అని ఆనం నిలదీశారు.