Maoists: 10న భారత్ బంద్.. మావోయిస్టుల పిలుపు
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:19 AM
ఆపరేషన్ కగార్‌లో భాగంగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ జూన్ 10న దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు. కేంద్రం, రాష్ట్రాలు శాంతి చర్చలకు స్పందించకుండా హింసను కొనసాగిస్తున్నాయని అభయ్ పేరిట విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు.
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్‌లో భాగంగా చేస్తున్న ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ జూన్ 10న దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట శనివారం ఒక ప్రకటన విడుదలైంది. జూన్ 11 నుంచి ఆగస్టు 3 వరకూ అమరుల స్మారక సభలు నిర్వహించాలని ఆ ప్రకటనలో కోరారు. శాంతి చర్చలకు సిద్ధమని తాము ప్రకటించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి హింసను కొనసాగిస్తున్నాయని ఆక్షేపించారు. 2026 మార్చి 31నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామంటున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చర్యల్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News