Liquor Scam: ఆ పేరు చెబితే నాకదే ఆఖరి రోజు
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:29 AM
మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తన ప్రాణాలకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఐటీ విచారణలో నలుగురు కీలక నిందితులు సరైన సమాధానాలు ఇవ్వక మౌనం వహించినట్లు సమాచారం.
సిట్ విచారణలో రాజ్ కసిరెడ్డి ఆందోళన
ఇంతకంటే ఏమీ చెప్పలేనంటూ మౌనం.. విచారణకు సహకరించని ఆ నలుగురు
బ్యాంకు లావాదేవీలు, ఐటీ రిటర్న్‌లు ముందుంచి ప్రశ్నించిన అధికారులు
కొన్నింటికి పొంతన లేని సమాధానాలు.. మరికొన్ని ప్రశ్నలకు మూగనోము
ముగిసిన లిక్కర్ గ్యాంగ్ కస్టడీ.. జిల్లా జైలుకు తరలించిన పోలీసులు
అమరావతి/విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): ‘మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు పేరు చె బితే... నాకు అంతిమ ఘడియలు వచ్చినట్లే.. అదే నాకు చివరి రోజవుతుంది’ అని ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘మీరేం చేసినా ఇంతకంటే ఇంకేమీ చెప్పలే ను’ అంటూ సిట్ అధికారుల ముందు తల దించుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకా రం... రెండు రోజుల సిట్ కస్టడీలో భాగంగా లిక్కర్ స్కాంలో కీలక నిందితులు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయ్‌రెడ్డి, జగన్ ఓఎస్డీ పి. కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ప్రశ్నించడానికి సిట్ అధికారులు 100 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. రెండు రోజుల పాటు ఏమడిగినా తమకేమీ తెలియదని బుకాయించారు. ‘మాకేంటి సంబంధం.. మమ్మల్నెందుకు అడుగుతారు.. తప్పుడు కేసుల్లో ఇరికించారు..’ అం టూ ఎదురు ప్రశ్నించారు. దీంతో అధికారులు శనివారం కొన్ని ఆధారాలు ముందుపెట్టి ప్రశ్నించడంతో నిందితులు మౌనం వహించారని తెలిసింది.

మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి కొన్ని ప్రశ్నల కు సమాధానాలిచ్చినా.. బ్యాంకు లావాదేవీలు, ఐటీ రిటర్న్‌లు ముం దుంచి ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం.
రెవెన్యూ రికార్డులు చూపించి ఇక్కడున్న ఆస్తులు ఎలా వచ్చా యి? ఈ లావాదేవీ ఎందుకు చేశారు? ఇందులో పెట్టుబడుల వివరాలు ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో ఎందుకు చూపించలేదు? అంటూ అడిగిన ప్రశ్నలకు ఆయన నీళ్లు నమిలినట్లు తెలిసింది. మరో గదిలో కృష్ణమోహన్ రెడ్డి(జగన్ ఓఎ్‌సడీ)ని ప్రశ్నించిన అధికారులు... ‘మీ కుమారుడు రోహిత్‌కు సంబంధించి న వ్యాపారాల్లో పెట్టుబడులు ఎలా వచ్చాయి? ముఖ్యం గా ఐదు కంపెనీల్లోని పెట్టుబడులు అనుమానాస్పదంగా ఉన్నాయి.. వాటి వివరాలు ఎందుకు దాచి ఉంచారు? రాజ్ కసిరెడ్డితో ఆర్థిక వ్యవహారాల గురించి మీరు జరిపిన సంభాషణ, వాట్సాప్ చాట్ గురించి ఏమంటారు?’ అనే ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉన్నట్లు తెలిసింది. భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఆర్థిక వ్యవహారాల గురించి ప్రశ్నించిన సిట్ అధికారులు అనుకున్న స్థాయిలో సమాచారం రాబట్టలేకపోయారు. అయితే మైసూరులో ఉన్న ఒక బ్యాంకు ఖాతాకు సంబంధించిన లావాదేవీలపై ప్రశ్నించడంతో గోవిందప్ప తడబడినట్లు సమాచారం. కాగా, మద్యం కుంభకోణంలో ఈ నలుగురు నిందితుల పోలీసు కస్టడీ శనివారం ముగిసింది. విచారణ ముగిసిన అనంతరం వారిని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. కాగా, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డ్రైవర్‌ను సిట్ అధికారులు శనివారం విచారించారు. ఎక్కడి నుంచి ఎక్కడకు, ఎవరెవరికి డబ్బులు చేరవేశారో, కారులో ఎవరెవరిని ఎక్కడెక్కడకు తీసుకెళ్లారు వంటి కీలక సమాచారాన్ని అధికారులు సేకరించినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News