Share News

ఎమ్మిగనూరును జిల్లా చేయాలి

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:17 AM

ఆదోనిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ ఎమ్మిగనూరును జిల్లా చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ తాలుకా అధ్యక్షుడు నాగరాజు, మండల అధ్యక్షుడు రమేశ్‌ నాయుడు కోరారు.

ఎమ్మిగనూరును జిల్లా చేయాలి
గోనెగండ్లలో మాట్లాడుతున్న నాయకులు

గోనెగండ్ల, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆదోనిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ ఎమ్మిగనూరును జిల్లా చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ తాలుకా అధ్యక్షుడు నాగరాజు, మండల అధ్యక్షుడు రమేశ్‌ నాయుడు కోరారు. వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతంలోని ప్రజల, రైతుల, కూలీల జీవనం మారుతుందన్నారు. ఈ ప్రాంతంలో వేలాదిఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన విద్యశాలలు ఉన్నాయని, తాగునీరు పుష్కలంగా ఉందని అన్నారు. ఎమ్మిగనూరు ఆదోని, కోడుమూరు, మంత్రాలయం, పత్తికొండ, అలూరు ప్రాంతాల మధ్యలో ఉండటతో అన్ని నియోజకవర్గాలకు అందుబాటులో ఉంటుదన్నారు. ఆలూరులో వేదవతి ప్రాజెక్టును నిర్మించాలని, పత్తికొండలో టమోటా జూస్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రామగోపాల్‌, బేతాలమాబాషా, పాల్గొన్నారు.

నందవరం: కర్నూలు జిల్లాలో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించాలని టీడీపీ మండల ఉపాధ్యక్షుడు లచ్చప్పనాయుడు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం నందవరం టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బీమశేఖర్‌ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆదోని జిల్లాకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అడ్డు పడుతున్నట్లు వైసీపీ నాయకులు ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ ఉన్నప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు సమయలో మీరు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో టీడీపీ నాయకులు మల్లప్పగౌడు, విశ్వనాథ్‌, రెహమాన్‌, గజేంద్ర నాయుడు, గడ్డం వెంకటేష్‌, సాతర్లరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 12:17 AM