బ్రహ్మోత్సవాలకు యాగ పూర్ణాహుతి
ABN , Publish Date - Mar 01 , 2025 | 12:13 AM
బ్రహ్మోత్సవాలకు యాగ పూర్ణాహుతి
నేటితో ముగియనున్న శివరాత్రి ఉత్సవాలు
శ్రీశైలం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో నవాహ్నిక దీక్షతో 11 రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం పదో రోజుకు చేరుకున్నాయి. ఉదయం అర్చకులు, వేదపండితులు యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, త్రిశూలస్నానం కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి యాగశాలలో చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. తరువాత వసంతోత్సవం నిర్వహించారు. చివరగా అవబుధ స్నానం, త్రిశూలస్నానం జరిపించారు. సాయంకాలం ధ్వజావరోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాల మెదటిరోజున బ్రహ్మోత్సవ పారంభ సూచికంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరించిన ధ్వజపటాన్ని అవరోహణ చేశారు. మహాశిరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. ఉదయం స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ, ఆలయ ఉత్సవం జరిపించనున్నారు. ఆలయ ఉత్సవం అనంతరం స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు : మహాశిరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. ఉదయం స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ, ఆలయ ఉత్సవం జరిపించనున్నారు. ఆలయ ఉత్సవం అనంతరం స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహించనున్నారు.
సదస్యం..నాగవల్లి
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణ మండపంలో సదస్యం, నాగవల్లి కార్యక్రమం జరిపించారు. సదస్యం కార్యక్రమంలో వేదపండితులు వేదస్వస్తి నిర్వహించారు. వేదపండితులు చతుర్వేద పారాయణలతో స్వామిఅమ్మవార్లను స్తుతించారు. నాగవల్లి కార్యక్రమంలో మహశివరాత్రి పర్వదినాన మల్లన్నను కల్యాణమాడిన భ్రమరాంబ అమ్మవారికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు, నల్లపూసలను సమర్పించారు.