Share News

జాబ్‌కార్డు ఉన్న వారందరికీ పనులు

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:21 AM

జాబ్‌కార్డు ఉన్న ఉన్నవారందరికీ ఉపాధి పనులు కల్పించాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా ఆదేశించారు. మంగళవారం వెల్దుర్తి మండలం అల్లుగుండు గ్రామంలో చేపడు తున్న ఉపాధి పనులను తనిఖీ చేశారు.

జాబ్‌కార్డు ఉన్న వారందరికీ  పనులు
మట్టి తవ్వుతున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

అల్లుగుండు గ్రామంలో ఉపాధి పనుల తనిఖీ

వెల్దుర్తి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): జాబ్‌కార్డు ఉన్న ఉన్నవారందరికీ ఉపాధి పనులు కల్పించాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా ఆదేశించారు. మంగళవారం వెల్దుర్తి మండలం అల్లుగుండు గ్రామంలో చేపడు తున్న ఉపాధి పనులను తనిఖీ చేశారు. కూలీలతో మాట్లాడి వారి నుంచి వివాలను తెలుసుకున్నారు. వేతనాల నిధులు త్వరలో విడుదల అవుతాయని తెలిపారు. పనుల, మస్టర్‌ వివరాలను ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియనుం దని జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధిం చాలని డ్వామా పీడీ వెంకటరమణయ్యను ఆదేశించారు.

లెక్టర్‌ పలుగు చేతపట్టి కూలీలతో కలిసి మట్టి తవ్వారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ కళ్యాణి, ఆర్డీవో సందీప్‌, డ్వామా పీడీ వెంకటరమణయ్య, తహసీల్దార్‌ చంద్రశేఖరవర్మ, ఎంపీడీవో సుహాసిని, డ్వామా ఏపీడీ లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 12:21 AM