Share News

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Jun 03 , 2025 | 11:55 PM

మహిళలు అన్ని రంగాలలో స్వశక్తితో రాణించాలి అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బుడ్డా

వెలుగోడు, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగాలలో స్వశక్తితో రాణించాలి అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. వెలుగోడులో బీసీ కోర్పోరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్‌ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంబించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గంలో మొదటి విడతగా 500 కుట్టు మిషన్లు వచ్చాయని మహిళలు కుట్టు శిక్షణలో మెలకువలు నేర్చుకొని ఆదాయం మమకూర్చుకోవాలని సూచించారు. టీడీపీ నాయకులు శేషిరెడ్డి, అబ్దుల్‌ కలాం, మోమిన్‌ రసూల్‌, వీరభద్రుడు, ఖలీల్‌, కృష్ణుడు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) పేదలకు వరమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తన స్వగ్రామం వేల్పనూరులో 24 మంది లబ్ధిదారులకు రూ.16,45,960 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

‘వెన్నుపోటుకు మారుపేరు జగన్‌’

ఆత్మకూరు: ప్రజలను అన్ని విధాలుగా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మాజీ సీఎం జగనేనని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి పొందిన రోజు జూన్‌ 4వ తేది అని అన్నారు. నరకాసుడి పాలన నుంచి ఓటు రూపంలో ప్రజలు విముక్తి పొందారని అన్నారు. మద్యపాన నిషేదం వంటి బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ తర్వాత మద్యంతోనే ఆ పార్టీ నాయకులు వేల కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడ్డారని అన్నారు. కల్తీ మద్యంతో 30వేల ప్రాణాలను బలికొని అక్కాచెల్లెమ్మల పసుపు కుంకుమలను దూరం చేశారని దుయ్యబట్టారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పి యువతను నట్టేట ముంచారన్నారు. పింఛన్లను పెంచుతామని చెప్పి చేసిన మోసమేంటో అందరికీ తెలుసన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఆతర్వాత వెన్నుపోటు పొడిచింది ఎవరో గుర్తించుకోవాలని సూచించారు. ల్యాండ్‌, ఇసుక, మైనింగ్‌, మద్యం స్కామ్‌ల నుంచి ప్రజల్ని దృష్టి మళ్లించేలా వైసీపీ నేతలు వెన్నుపోటు డ్రామాలు ఆడుతున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో చచ్చిన పార్టీని బతికించుకోవ డానికి జగన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. వెన్నుపోటు దినానికి బదులు గొడ్డలిపోటు దినం, తల్లి, చెల్లిని గెంటేసిన దినాలను చేసుకోవాలని సూచించారు.

Updated Date - Jun 03 , 2025 | 11:56 PM