మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Mar 09 , 2025 | 12:11 AM
మహిళలు అన్ని రంగాలలో రాణించాలని డీఎస్పీ మర్రిపాటి హేమలత సూచించారు. శనివారం అమరావతి పాఠశాలలో వేడుకలకు డీఎస్పీ హేమలత, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కరెస్పాండెంట్ గుడిసె రామకృష్ణ, రాజేశ్వరి పాల్గొన్నారు.

ఆదోని డీఎస్పీ మర్రిపాటి హేమలత
ఆదోని, ఆలూరులో పత్తికొండ నియోజకవర్గాల్లో మహిళా దినోత్సవం
ఆదోని అగ్రికల్చర్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగాలలో రాణించాలని డీఎస్పీ మర్రిపాటి హేమలత సూచించారు. శనివారం అమరావతి పాఠశాలలో వేడుకలకు డీఎస్పీ హేమలత, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కరెస్పాండెంట్ గుడిసె రామకృష్ణ, రాజేశ్వరి పాల్గొన్నారు.
వాల్మీకి ఉద్యోగుల ఆధ్వర్యంలో
వాల్మీకి ఉద్యోగుల సంఘం అధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు సుశీల, స్కూల్ అసిస్టెంట్ భవాని, ఉపాధ్యాయురాలు అనురాధ, కళ్యాణి దేవిలను ఘనంగా సన్మానించారు. జిల్లా నాయకుడు బాల వెంకటేష్ మాట్లాడుతూ మహిళలు ఉద్యమ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. నాయకులు ముక్కరన్న, నీలకంఠ నాయుడు, లక్ష్మీనారాయణ, నరసయ్య, లక్ష్మీకాంత్, సత్తన్న, రమేష్ నాయుడు, సుధాకర్ బాబు, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
తుగ్గలి: మండలంలోని తుగ్గలి, జొన్నగిరి, రాంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించారు. టీడీపీ మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు మాట్లాడుతూ మహిళల అభివృద్ధితో కుటుంబం చెందుతుదన్నారు. సర్పంచ్ మనేంద్ర, ఆర్డీటీ సంస్థ ప్రతినిధులు సీఆర్పీ నగేష్ తదితరులు ఉన్నారు.
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
పత్తికొండ టౌన్: పట్టణంలో కేపీఆర్ ట్రస్టు వ్యవస్థాపకులు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, సర్పంచ్ కొమ్ముదీపిక, ఆసుపత్రి సూపరింటెండెంట్ కల్పన, కార్యదర్శి కాలేబొ కారియా, వాసవి మండలి అధ్యక్షురాలు మమతను సన్మానించారు.
ఆలూరు: విద్యతోనే బాలికల అభివృద్ధి సాధ్యమని టీడీపీ రఆర్గనైజింగ్ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ అన్నారు. శనివారం కేజీబీవీ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. ఎస్‌వో సుహాసిని, టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్, రెహ్మాన్, విశ్వతేజ పాల్గొన్నారు.
టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్ పార్టీ కార్యాలయంలో మహిళలను సన్మానించారు. బ్రాంచ్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు నగరడోణ కిష్ణప్ప, మాజీ మర్కెట్ యార్డ్ చైర్మన్ రాంనాఽథ్ యాదవ్, టీడీపీ మండల కన్వీనర్ అశోక్, నాయకులు గరి మల్లేష్, కొమ్ము రాజు, కిట్లు, రత్నమ్మ, నాగమణి పాల్గొన్నారు.
ఆదోని రూరల్: చంద్రబాబుతోనే మహిళాభివృద్ధి సాధ్యమని తెలుగు మహిళా కార్యదర్శి సాధికాబేగం, జిల్లా ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి, శ్రీదేవి అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. సీఎం చంద్రబాబు మహిళల రక్షణ, అభివృద్ధిపై పరితపిస్తారన్నారు.
అలూరు రూరల్: మహిళలను అన్ని రంగాల్లో గుర్తిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఎంఈవో-2 చిరంజీవి తెలిపారు. శనివారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో యుటీఎఫ్, ఎస్‌టీయూ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సమతా సంచికను ఆవిష్కరించారు. సుజాతమ్మ, జయమ్మ, నిర్మల రాణి, రామలింగమ్మ, అత్సరభాష, హేమలత యూటీఎఫ్ నాయకులు ఖాసీం, రూపాలత, సురేష్ బాబు, బి రామాంజినేయులు, రంగస్వామి, పాల్గొన్నారు.
ఆదోని టౌన్: మహిళల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమని రజక కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రి అన్నారు. స్వకుల సాళే అంకిని, దశాంకిని కో- ఆపరేటివ్ సొసైటీ, వరల్డ్ సాళే ఫౌండేషన్ సంయుక్తంగా శనివారం రాత్రి మహిళా దినోత్సవం నిర్వహించారు. మునిసిపల్ చైర్‌పర్సన్ వాల్మీకి శాంత, ఎంవీఐ శిషిర దీప్తి మాట్లాడుతూ, మహిళలు రాజకీయాలలో కూడా ప్రత్యేకత చాటుకొంటున్నారన్నారు. రసాలే అంబిక, మైత్రియి నాట్యప్రదర్శన అందరినీ అలరించింది.
వెల్దుర్తి టౌన్: మహిళలు అన్ని రంగాల్లో ముందుంటేనే సమాజం అభివృద్ది చెందుతుందని డా. రవీంద్ర, డా. అనుపమ పేర్కొన్నారు. మహిళా వైద్యులను సన్మానించారు. శాంతి, డా. ప్రవళ్లిక నరసింహులు, మోతిబాషా, జనార్దన్ నాయుడు పాల్గొన్నారు.
కప్పట్రాళ్ల మహిళలు దేశానికే ఆదర్శం కావాలి
దేవనకొండ: కప్పట్రాళ్ల మహిళలు దేశానికే అదర్శం కావాలని ఈగల్ ఐజీ అకె రవికృష్ణ సూచించారు. శనివారం కప్పట్రాళ్ల తానాభవనంలో సేట్రీస్ అధ్వర్యంలో మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. దత్తత పుత్రుడు రవికృష్ణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మహిళలు చేతివృత్తులు, వ్యాపారం, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. అలాగే దేవనకొండ వైద్యశాలలో డీఎంహెచ్‌వో భాస్కర్, తేర్నేకల్‌లో సర్పంచ్ అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
మద్దికెర: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినప్పుడే అభివృద్ది సాధ్యమని పత్తికొండ సీఐ పులిశేఖర్‌గౌడ్, విద్యాసాయి కళాశాల ఎండీ వెంకట మాధవ్ అన్నారు. ప్రిన్సిపాల్ బాలసునీత, సర్పంచ్ బండారు సుహాసిని, ప్రభుత్వ వైద్యాధికారి రాగిణి, ఎస్‌ఐ విజయకుమార్ నాయక్,ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.