మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:27 AM
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డీఆర్వో వెంకటనారాయణమ్మ అన్నారు.

కర్నూలు కలెక్టరేట్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డీఆర్వో వెంకటనారాయణమ్మ అన్నారు. అంత ర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్ సునయన ఆడిటోరియం మైదానంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏపీజేఏసీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళా క్రీడలను జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారా యణమ్మ ప్రారంభించి మాట్లాడారు. మహిళల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. కలెక్టరేట్‌లోని వివిధ శాఖలలో పనిచేస్తున్న మహిళలు టెన్నికాయిట్, మ్యూజికల్ చైర్, లెమన స్పూన, షటిల్, త్రోబాల్, టగ్‌ఆప్ ఫర్, షాట్‌ఫుట్, షటిల్ తదితర క్రీడల్లో పాల్గొన్నారు. విజేతలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేస్తామని ఆమె తెలిపారు. సర్వజన ప్రభుత్వ వైద్యశాల ఏవో సింధూ సుబ్రహ్మ ణ్యం, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ యానీ ప్రతాప్, ప్రెసిడెంట్ దీప, ఏపీ జేఏసీ అమరావతి ఉమెన వింగ్ చైర్ పర్సన సహారాభాను, జనరల్ సెక్రటరీ సి.పద్మావతి, సరస్వతి పాల్గొన్నారు.