కూటమి ప్రభుత్వంలో సంక్షేమం పరుగులు
ABN , Publish Date - Feb 05 , 2025 | 11:57 PM
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడు తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.
తడకనపల్లెలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడు తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. బుధవారం కల్లూరు మండలం తడకనపల్లెలో ఎమ్మెల్యే పర్యటించి సీసీ రోడ్లు, గోకులంషెడ్లు, చెరువుకు నీటి విడుదల పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ ఎన్నికల్లో రైతులకు తడకనపల్లె చెరువు నింపు తానని హామీ ఇచ్చామని, ఈ మేరకు చెరువుకు నీరు నింపామని అన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ నిధులు రూ.21.5 లక్షలతో 5 రోడ్ల ఏర్పాటుకు భూమిపూజ చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మూడు ఏళ్లుగా చెరువుకు నీరు నింపకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. కార్యక్రమంలో ఏపీ అర్బన ఫైనాన్స ఇనప్రాస్ట్రక్షర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ డి.రా మాంజనేయులు, పుసులూరు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీడీఓ నాగశే షాచలరెడ్డి, మైనర్ ఇరిగేషన డీఈ నాగరాజు, పంచాయతీరాజ్ డీఈ నాగిరెడ్డి, ఏఈ రవిమోహనరెడ్డి, ఏపీఓ మద్దీశ్వరమ్మ, కాంట్రాక్టర్ సుల్తానమియా, జనసేన నాయకుడు సలాం, ఐటీడీపీ హుసేన, మహిళా సంఘం మండల అధ్యక్షురాలు జేబేదాబీ పాల్గొన్నారు.