తూనికలు, కొలతల శాఖ తనిఖీలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:59 AM
నగరంలోని పాతబ స్టాండు సమీపంలోని బంగారు నగర దుకాణాలపై తూని కలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేశారు.

కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): నగరంలోని పాతబ స్టాండు సమీపంలోని బంగారు నగర దుకాణాలపై తూని కలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. మంగళవారం అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీరాముడు ఆధ్వర్యంలో ఎస్‌కేఎస్ షాపింగ్ కాంప్లెక్స్, ఎస్‌కేఎస్ షరాఫ్ బజార్‌లోని బంగారు దుకాణాల్లో తనిఖీ లు చేశారు. బిల్లులో గోల్డ్ ప్యూరిటీ, స్టోన వెయిట్ తెలుపకపోవడంతో 4 కేసులు నమోదు చేసి రూ.50వేల జరిమానా వసూలు చేశారు. తనిఖీల్లో ఇన్సపెక్టర్లు పరమే శ్వరకుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు.