టౌన బ్యాంకు సేవలను విస్తరిస్తాం
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:34 AM
ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ టౌన బ్యాంకు సేవలను అన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి
ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ టౌన బ్యాంకు సేవలను అన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇటీవల కొత్తగా నియమించిన ది-ఎమ్మిగనూరు కో-ఆపరేటీవ్ టౌన బ్యాంకు పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. టౌన బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకరోత్సవ కార్యక్రమంలో చైర్మన ఉరుకుందయ్యశెట్టి, వైస్ చైర్మన బండా నరసప్ప, సభ్యులుగా యు.కె. రవికుమార్, దోమ భీమేష్, వెంకటేశ్వరరెడ్డి, యం. మహబూబ్, షాలేము, వెంకటగిరి, నరసింహులు, నవీణ్‌కుమార్‌లతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకా రం చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్లకాలంలో బ్యాంకు ఎనపీఏను పూర్తిగా తగ్గించారని, అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఎనపీఏ తిరిగి 11 నుంచి 14 శాతం పెరిగిందన్నారు. ఇది బ్యాంకు ఆర్థిక పరిస్థితికి విఘాతం కలిగిస్తుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని పాలక మండలి బ్యాంకు అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీవో రామాంజనేయులు, స్థానిక నాయకులు వై.పీ.ఎం కొండయ్య చౌదరి, ముగతి ఈరన్నగౌడు, రాందాసుగౌడు, మిఠాయి నరసింహులు, ముల్లాఖలీముల్లా, తురేగల్ నజీర్, హాజీ బడేసాబ్, ఫారుక్, బందెనవాజ్, కనికె నాగరాజు, షాబీర్, చేనేత మల్లి, సోడాల శ్రీను, ఇషాక్, వాహిద్, బ్యాంకు సీఈవో గడిగె కళ, మాజీ సీఈవో గంగాధర్, జనసేనా, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.