Share News

బాధితులకు న్యాయం చేస్తాం

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:48 PM

బాధితులకు న్యాయం చేస్తాం

బాధితులకు న్యాయం చేస్తాం
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ

పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ

నంద్యాల క్రైం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తామని ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా తెలిపారు. సోమవారం నంద్యాలలోని బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రెసల్‌ సిస్టం) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వచ్చి ఎస్పీకి వినతులు సమర్పించారు. పలు సమస్యలపై 95మంది ఫిర్యాదుదారులు అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అధికారులకు సూచించారు. సివిల్‌ తగాదాలు, కుటుంబకలహాలు, అత్తారింటి వేధింపులు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు తదితరాలున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రాలేనివారు ప్రతి సోమవారం సమీప పోలీస్‌ స్టేషన్‌, సర్కిల్‌ ఆఫీస్‌, డీఎస్పీ కార్యాలయాల్లో జరిగే పీజీఆర్‌ఎ్‌సలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డీపీవో మంద జావళి ఆల్ఫోన్స్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 11:48 PM