Share News

సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తాం

ABN , Publish Date - May 23 , 2025 | 12:23 AM

మీ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు.

 సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తాం
సీహెచ్‌వోలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

నంద్యాల హాస్పిటల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): మీ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. నంద్యాలలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద సీహెచ్‌ వోలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె శిబిరాన్ని గురువారం ఆమె సం దర్శించారు. నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్‌యార్డులో జరిగిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమానికి వెళుతూ సీహెచ్‌ఓల శిబిరం వద్ద వాహనాన్నిఆపి వారిని పరామర్శించి సమస్యలు అడిగి తెలుసు కున్నారు. సీహెచ్‌వోలు చేస్తున్న నిరవధిక సమ్మె గురువారానికి 25వ రో జుకు చేరింది. ఏపీఎంసీఏ జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ, కార్యదర్శి గురుప్ర సాద్‌, ఉపాధ్యక్షుడు భాస్కర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సౌందర్య, సీహెచ్‌వోలు చక్రధర్‌, హారిక, అఖిల్‌, భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:23 AM