మహనీయులను స్మరించుకోవాలి
ABN , Publish Date - Aug 07 , 2025 | 11:56 PM
ప్రతి ఒక్కరూ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాలని డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్‌రెడ్డి సూచించారు.
ఆత్మకూరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాలని డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్‌రెడ్డి సూచించారు. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించు కుని డీఆర్‌డీఏ - వెలుగు ఆధ్వర్యంలో గురువారం ఆత్మకూరు పట్ట ణంలో హర్‌ఘర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ ఉమర్, డిప్యూటీ తహసీల్దార్ ఆంజనేయులు, ఆత్మకూరు ఏరియా కోఆర్డినేటర్ పుల్లయ్య, ఏపీఎం కాశీశ్వరుడు, వెలుగు సీసీలు ఉన్నారు.