పత్తికొండ చెరువుకు హంద్రీ నీవా నీరు
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:54 PM
పత్తికొండ చెరువుకు బుధవారం హంద్రీనీవా నీరు చేరింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి 68 చెరువులకు నింపేందుకు ప్రణాళికలు రూపొందించి 60శాతం పనులను పూర్తిచేశారు.

పత్తికొండ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ చెరువుకు బుధవారం హంద్రీనీవా నీరు చేరింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి 68 చెరువులకు నింపేందుకు ప్రణాళికలు రూపొందించి 60శాతం పనులను పూర్తిచేశారు. అనంతరం 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో పనులు నిలిచిపోయాయి. చివరగా ఎన్నికల అస్త్రంగా చెరువులకు నీరునింపేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రారంభించినా సాంకేతిక లోపాలతో చెరువులకు నీరుచేరలేదు.
కాగా 2024లో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం శ్యాంబాబు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో చెరువలను నింపేం దుకు నడుం బిగించారు. పనులు పూర్తి కావడంతో బుగ్గవంక ద్వారా చెరువుకు నీరుచేరింది. టీడీపీ నాయకులు శ్రీదర్‌రెడ్డి, తిరపాల్‌నాయుడు, మీరాహుసేన్, హుల్తెన్న హంద్రీనీవా నీటిని పరిశీలించారు.