Share News

ఉపాధి కూలీ బకాయిలు విడుదల చేయాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:18 PM

ఉపాధి కూలీలకు బకాయిలను చెల్లించాలని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీరశేఖర్‌, నారాయణ డిమాండ్‌ చేశారు.

ఉపాధి కూలీ బకాయిలు విడుదల చేయాలి
నిరసన తెలుపుతున్న ఉపాధి కూలీలు

పత్తికొండ టౌన్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కూలీలకు బకాయిలను చెల్లించాలని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీరశేఖర్‌, నారాయణ డిమాండ్‌ చేశారు. గురువారం ఆర్డీవో కార్యాలయం వద్ద తట్ట, చెలిక, పారతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించి రోజుకు రూ.500లు వేతనం ఇవ్వాలన్నారు. పని ప్రదేశంలో మరణిస్తే రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. అనంతరం ఆర్డీవో, సూపరింటెండెంట్లకు వినతి పత్రం అందజేశారు.

మార్చి 12న ఛలో అసెంబ్లీ

జాతీయ ఉపాధి హామీ పథకం పట్ల ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ మార్చి 12వ తేదీన ఛలో అసెంబ్లీ నిర్వహిస్తున్నామని వ్యవసాయ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ బడ్జెట్‌లో ఉపాధి హామీ నిధులకు కోత పెడుతున్నారని మండిపడ్డారు. రూ.లక్ష కోట్లు కేటాయించాలని, అడిగినవారందరికీ పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీరశేఖర్‌, నారాయణ, లింగన్న, బాలకృష్ణ, దస్తగిరి పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:18 PM