ఓటు వజ్రాయుధం
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:18 AM
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం. ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేసుకోవడం వల్ల నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది.

నమోదుకు నిరంతరాయంగా అవకాశం
18 ఏళ్లు నిండిన వారంతా అర్హులే
నేడు 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం
కర్నూలు కలెక్టరేట్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం. ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేసుకోవడం వల్ల నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకోకపోతే ప్రజాస్వామ్యానికి చేటు చేసినట్లు అవుతుంది. అర్హులందరూ ఓటర్లుగా దరఖాస్తు చేసుకోవడమే గాక స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అర్హులైన పౌరులందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం నిరంతరాయంగా కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, గుర్తింపు కార్డుల పంపిణీ చేపడుతోంది. జిల్లాలో అర్బన్ పోలింగ్ స్టేషన్స్ 698, రూరల్ పోలింగ్ స్టేషన్స్ 1505 ఉన్నాయి.
18 నుంచి 19 సంవత్సరాల వారు 27,927 మంది ఉన్నారు.
20 నుంచి 29 సంవత్సరాల వారు 4,17,189 మంది
30 నుంచి 39 సంవత్సరాల వారు 5,65,297 మంది
40 నుంచి 49 సంవత్సరాల వారు 4,52,744 మంది
50 నుంచి 59 సంవత్సరాల వారు 3,07,413 మంది
60 నుంచి 69 సంవత్సరాల వారు 1,78,059 మంది
70 నుంచి 79 సంవత్సరాల వారు 86,734 మంది
80 సంవత్సరాలపైబడిన 27,206 మంది ఓటర్లు ఉన్నారు.
విభిన్న ప్రతిభావంతులు పురుషులు 13,724 మంది, స్త్రీలు 10,180, థర్డ్‌జెండర్
ఓటర్లు నలుగురు నమోదయ్యారు.
ఈ నెల ఆరో తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రకారం వివరాలు
నియోజకవర్గం పోలింగ్ పురుషులు స్త్రీలు థర్డ్ మొత్తం
కేంద్రాలు జెండర్ ఓటర్లు
137-కర్నూలు 258 1,32,658 1,41,869 26 2,74,553
138-పాణ్యం 355 1,61,799 1,70,969 74 3,32,842
142-పత్తికొండ 257 1,11,922 1,12,430 22 2,24,374
143-కోడుమూరు
(ఎస్సీ) 275 1,23,768 1,23,691 16 2,47,475
144-ఎమ్మిగనూరు 271 1,22,570 1,26,273 45 2,48,888
145-మంత్రాలయం 237 1,02,763 1,06,754 25 2,09,542
146-ఆదోని 256 1,30,961 1,33,669 52 2,64,682
147-ఆలూరు 294 1,30,633 1,29,528 52 2,60,213
మొత్తం 2,203 10,17,074 10,45,183 312 20,62,569