హంద్రీ నీవా ఎస్‌ఈగా వరప్రసాద్
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:39 PM
హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ ఎంఎల్‌ఎన్ వరప్రసాద్ శనివారం బాధ్యతలు చేపట్టారు.

కర్నూలు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ ఎంఎల్‌ఎన్ వరప్రసాద్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఎఫ్‌ఏసీ ఇన్‌చార్జి ఎస్‌ఈ సురేశ్‌బాబు ద్వారా ఆయన బాధ్యతలు స్వీకరించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పాణ్యం ఈఈగా పని చేస్తున్న వరప్రసాద్ ఈ నెల 17న ఎస్‌ఈగా పదోన్నది ఇచ్చి హంద్రీనీవా కర్నూలు సర్కిల్ ఎస్‌ఈగా బదిలీ చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, డీఈఈలు శివప్రసాద్, మల్లికార్జునరెడ్డి తదితరులు ఆయనను కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఇన్‌చార్జి ఎస్‌ఈగా పని చేసిన సురేశ్‌బాబు అవుకు ఈఈగా కొనసాగుతారు.