ఘనంగా వాజ్‌పేయి జయంతి
ABN , Publish Date - Dec 26 , 2025 | 01:13 AM
పట్టణంలో మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు.
నంద్యాల నూనెపల్లె, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): పట్టణంలో మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. గురువారం నంద్యాల బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు గోపాలకృష్ణమూర్తి, రవీంద్ర, మురళిచౌదరి, చాందిని, మైనార్టీ నాయకులు మహభూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: దేశానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ నాయకులు మల్లెల కృష్ణారెడ్డి, విశ్వరూపాచారి, మౌలిబాషా, సుదర్శన్, సాంబశివగౌడ్, శంకర్ గౌడ్ అన్నారు. గురువారం పట్టణలోని గౌడ్‌సెంటర్‌లో వాజ్‌పేయ్ చిత్రపటానికి క్షీరాభిషేకం గావించడంతో పాటు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు వెంకటరమణ, గోపాల్, శ్రీధర్‌గుప్తా, నూర్ తదితరులు ఉన్నారు.
ఆత్మకూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మోమిన్ షబాన ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళి అర్పించారు. అనంతరం దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నాయకులు వెంకటరామిరెడ్డి, కిరణ్‌కుమార్‌గౌడ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.