Share News

ఓటు వేసినప్పుడే పండుగ

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:56 PM

ఓటు వేసినప్పడే పండుగ అని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భదర్వాజ్‌ పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

ఓటు వేసినప్పుడే పండుగ
ఆదోనిలో ర్యాలీని ప్రారంభిస్తున్న సబ్‌ కలెక్టర్‌ భరద్వాజ్‌

సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ర్యాలీ

ఆదోని, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఓటు వేసినప్పడే పండుగ అని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భదర్వాజ్‌ పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం భీమా సర్కిల్‌లో మానవహారం ఏర్పాటు చేసి, ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు మరియు పోలింగ్‌ కేంద్రాలలో ఓటర్‌ నమోదులో ప్రతిభ చూపిన బీఎల్‌వోలకు ప్రశంశాపత్రాలు అందజేశారు. తహసీల్దార్‌ శివరాముడు, కమిషనర్‌ కృష్ణ, ఎన్నికల డీటీ గాయత్రి, డీటీ వలి బాషా పాల్గొన్నారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఆర్డీవో

పత్తికొండ టౌన్‌: ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పత్తికొండ ఆర్డీవో భరత్‌ నాయక్‌ సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా శనివారం పట్టణంలోని డిగ్రీ కళాశాల నుంచి నాలుగు స్థంభాల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. భారత దేశంలో ఓటుకు ప్రాధాన్యం ఉందన్నారు. పాలకులను గద్దెనెక్కించాలన్నా, దించాలన్నా ఒటే ఆధారమన్నారు. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రమేష్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.

దేవనకొండ: ఓటు ప్రజలకు వజ్రాయిధమని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అజయ్‌ కుమార్‌, తహసీల్దార్‌ లోకేశ్వరయ్య అన్నారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి, బస్టాండ్‌ వద్ద మానవహారాన్ని నిర్మించారు. వీఆర్వో దాదావలి, హెచ్‌ఎం మద్దిలేటి పాల్గొన్నారు.

తుగ్గలి: ఓటు తలరాతలను మారుస్తుందని తహసీల్దార్‌ రమాదేవి అన్నారు. శనివార స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఓటరు దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. ఓటు అమ్ముకోవడం నేరమని, మన భవిష్యత్తును తాకట్టు పెట్టినట్లేనన్నారు. డిటీ నాగరాజు, ఉపాధ్యాయులు చందు నాయక్‌, వీఆర్వోలు నాగేంద్ర, కాశీ రంగస్వామి, స్వరూప్‌, తిమ్మయ్య, నవీద్‌ పటేల్‌ తదితరులు ఉన్నారు.

మద్దికెర: 18సంవత్సరాలు దాటిన వారు ఓటు నమోదు చేసుకోవాలని తహసీల్దార్‌ హుశేన్‌సాహెబ్‌ సూచిం చారు. మద్దికెరలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. వీఆర్వోలు రంగస్వామి, రషీద్‌, హర్ష, స్వర్ణ, రామాం జులు, శ్రీరాములు, మల్లికార్జున, శివన్న ఉన్నారు.

వెల్దుర్తి: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని తహసీల్దార్‌ చంద్రశేఖర వర్మ అన్నారు. కార్యాలయం నుంచి పాతబస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓటర్లు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.

Updated Date - Jan 25 , 2025 | 11:56 PM