ముంచిన మినుములు
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:16 AM
ఫొటోలో కనిపిస్తున్న రైతు దేవనకొండకు చెందిన వంట రంగడు. 2.5 ఎకరాల్లో మినుము సాగు చేశాడు. వైరస్ ప్రభావంతో దిగుబడి ఎకరాకు 1.25 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. దీంతో దిక్కు తోచడం లేదు.

వాతావరణ ప్రభావం, వైరస్ దాడితో తగ్గిన దిగుబడి
తీవ్రంగా నష్టపోయిన రైతులు
దేవనకొండ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవనకొండ, అలారుదిన్నె, వెలమకూరు, కుంకనూరు గ్రామాల్లో దాదాపై 200ఎకరాలకు పైగా మినుము సాగు చేశారు. పంట సాగుకు ఎకరాకు రూ.25వేల పెట్టుబడి పెట్టారు.
వైరస్ దాడి..
పంట సాగు చేసిన మొదట్లో పంట బాగా పెరిగింది. డిసెంబర్‌లో తుఫాన్ ప్రభావం, అనంతరం వైరస్ దాడితో పంట దెబ్బతింది. దీంతో రైతులు పురుగు మందుల వ్యాపారుల వద్దకు వెళ్లి మందులు తెచ్చి పిచికారీ చేశారు. అయినా వైరస్ అదుపులోకి రాలే దు. దీంతో దిగుబడి తగ్గింది.
తగ్గిన దిగుబడి..
ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లు వస్తే రైతుకు కొంత మేలు చేకూరే అవకాశముంది. అయితే ఇప్పుడు ఎకరాకు 1.5క్వింటం మ్రాతమే రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
రైతులకు సూచనలు ఇస్తాం
రైతులు మమ్మల్ని అడితే సూచనలు ఇస్తాం. కొందరు రైతులు నేరుగా పురుగు మం దులు పిచికారీ చేశారు. ఎనిమి ది ఎకరాలు మాత్రమే పంట నమోదు చేశారు. - సురేష్ బాబు, ఏవో