అనుమతి లేని ల్యాబ్‌లను సీజ్ చేయాలి: ఏఐవైఎఫ్
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:44 AM
లెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న అనుమతి లేని ప్రైవేటు ల్యాబ్‌లను సీజ్ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాసులు, నగర కార్యదర్శి బీసన్న డిమాండ్ చేశారు.

కర్నూలు హాస్పిటల్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న అనుమతి లేని ప్రైవేటు ల్యాబ్‌లను సీజ్ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాసులు, నగర కార్యదర్శి బీసన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐవైఎఫ్ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వ హించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి లేకుండా అర్హత లేనటువంటి వ్యక్తులు డయోగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నార న్నారు. ఈ విషయాన్ని పలుసార్లు వైద్యఆరోగ్య శాఖ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా కేంద్రాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. బుధవారపేటలో ఉన్న అనుమతి లేని ప్రైవేటు ల్యాబ్ యజమాన్యాలు దళారీలను ఏర్పాటు చేసుకుని నేరుగా కర్నూలు జీజీహెచలోని బెడ్ దగ్గరకు వెళ్లి శాంపిల్స్ తీసుకుని గ్రామీణులను దోపిడీ చేస్తున్నారన్నారు. శాంపిల్స్ తీసుకుని పరీక్షల కోసం వస్తున్న రోగుల సహాయకులకు మాయమా టలు చెప్పి తమ ల్యాబ్‌లకు తీసుకెళ్లి దోపిడీ చేస్తున్నారన్నారు. ఇప్ప టికైనా కలెక్టర్ స్పందించి అనుమతి లేని ప్రైవేటు ల్యాబ్‌లను సీజ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు చంటికృష్ణ, శ్రీకాంత, అఖిల్ నాయకులు పాల్గొన్నారు.