Share News

హెల్త్‌ కేర్‌ బయో మెడికల్‌ పరికరాలపై శిక్షణ

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:51 AM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాలులో బయో మెడికల్‌ వైద్యపరిక రాలపై నర్సింగ్‌ సిబ్బందికి బుధవారం అవగాహన సదస్సు నిర్వహిం చారు.

హెల్త్‌ కేర్‌ బయో మెడికల్‌ పరికరాలపై శిక్షణ
మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు

కర్నూలు హాస్పిటల్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాలులో బయో మెడికల్‌ వైద్యపరిక రాలపై నర్సింగ్‌ సిబ్బందికి బుధవారం అవగాహన సదస్సు నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్‌ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆసుపత్రిలోని పలు ఎమర్జెన్సీ విభాగాల్లో ఉండే బయోమెడికల్‌ పరికరాలు ప్రతిరోజు శుభ్రంగా ఉండేటట్లు చూసు కోవాలని నర్సింగ్‌ సిబ్బందిని ఆదేశించారు. సీఎస్‌ఆర్‌ఎంవో డా.బి. వెంకటే శ్వరరావు, అడ్మినిస్ర్టేటర్‌ సింధు సుబ్రహ్మణ్యం, నర్సింగ్‌ సూపరింటెం డెంట్‌ సావిత్రిబాయి, బయో మెడికల్‌ ఇంజనీర్‌ ఉమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 12:51 AM