జుమాలదిన్నెలో ట్రాఫిక్ జామ్
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:24 AM
కార్తీక అమావాస్య పర్వదినం కావడంతో ఉరుకుందకు భారీ సంఖ్యలో వాహనాలు పోటెత్తడంతో కోసిగి-జుమాలదిన్నె సమీపంలోని ప్రధాన రోడ్డుపై బారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కోసిగి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కార్తీక అమావాస్య పర్వదినం కావడంతో ఉరుకుందకు భారీ సంఖ్యలో వాహనాలు పోటెత్తడంతో కోసిగి-జుమాలదిన్నె సమీపంలోని ప్రధాన రోడ్డుపై బారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందల సంఖ్యలో వాహనాలు రోడ్డుపైనే రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాయి. దీంతో వాహనాదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం కార్తీక అమావాస్య సందర్భంగా మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వాహనంలో తరలిరావడంతో జుమాలదిన్నె గ్రామ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్‌తో రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటల పాటు వాహనదారులు, భక్తులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం ట్రాఫిక్ క్లీయర్ కావడంతో వాహనాలు ముందుకు కదిలాయి.