ప్రత్యేక జిల్లాతోనే పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:04 AM
ఆదోని జిల్లా సాధనతోనే పశ్చిమప్రాంత నియోజకవర్గాలు, పల్లెలు సస్యశ్యామలం అవుతాయని ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు రఘురామయ్య, అశోకానంద రెడ్డి, కృష్ణమూర్తి గౌడ్, వీరేష్, కోదండ, దస్తగిరినాయుడు అన్నారు.
ఆదోని అగ్రికల్చర్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆదోని జిల్లా సాధనతోనే పశ్చిమప్రాంత నియోజకవర్గాలు, పల్లెలు సస్యశ్యామలం అవుతాయని ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు రఘురామయ్య, అశోకానంద రెడ్డి, కృష్ణమూర్తి గౌడ్, వీరేష్, కోదండ, దస్తగిరినాయుడు అన్నారు. ఆదివారం 29వ రోజు దీక్షలో ఏపీఎన్‌జీవో మహిళా నాయ కులు, పీవోడబ్ల్యూ నాయకురాళ్లు మేము సైతం అంటూ దీక్షలో కూర్చు న్నారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ నెల రోజులుగా ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ ప్రజలు ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని అన్నారు. దీక్షలో ఏపీఎన్‌జీవో మహిళా అధ్యక్షురాలు ఉషారాణి, సుజ్ఞానమ్మ, మంజుల, లక్ష్మీ, ధనలక్ష్మీ, అరుణజ్యోతి, నరసమ్మ, సుజాత, సరళ, కళ్యాణి, గంగమ్మ, కళావతి, ధనుశ్రీ, నీలమ్మ, శాంతమ్మ, హనుమంతమ్మ దీక్షలో కూర్చున్నారు. దీక్షకు మద్దతుగా జేఏసీ నాయకులు భీమాస్ కూడలిలో ఆందోళన చేపట్టారు.
ఆలూరు: వెనుకబడిన ఆలూరు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని వాల్మీకి బోయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంభీంనాయుడు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆదోని జిల్లా సాధన కోసం ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో కొక్కరచేడు, చాకిబండ గ్రామాల ఎమ్మార్పీఎస్ నాయకులు, పత్తికొండ డివిజన్ అధ్యక్షుడు ఎల్లప్ప ఆధ్వర్యంలో ఓబులపతి, సూరి, రాజు, గాదిలింగలు, మాజీ స్పంచ్ తుంబలబీడు లక్ష్మన్న దీక్షలో కూర్చున్నారు. వీరికి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కత్తి రామాంజనేయులు, భూపేష్, చంద్రకాంత్‌రెడ్డి, జర్నలిస్ట్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు స్వరూప్‌కుమార్ పాల్గొన్నారు.