Share News

వక్ఫ్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:25 AM

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నందికొట్కూరు పట్టణంలో ముస్లింలు, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.

వక్ఫ్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
ర్యాలీ చేస్తున్న ముస్లింలు, వామపక్షాల నాయకులు

నందికొట్కూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నందికొట్కూరు పట్టణంలో ముస్లింలు, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ముస్లిం జేఏసీ కన్వీనర్‌ మౌలాన రఫీక్‌ జామయి మాట్లాడుతూ వక్ఫ్‌ బోర్డు ఆస్తులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని ముస్లీం మైనార్టీ సమాజాన్ని బలహీన పరిచేలా కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. జేఏసీ నాయకులు సలాంఖాన్‌, దౌలత్‌ బాషా, అబ్దుల్‌ రెహమాన్‌, మహబూబ్‌ బాషా, వామపక్ష నాయకులు నాగేశ్వరరావు, నరసింహులు, రఘురాంమూర్తి, వెంకటేశ్వర్లు, రమేష్‌ బాబు, రజిత, షాజహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 01:25 AM