Share News

దొంగ దొరికాడు

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:28 AM

అంతర్‌రాష్ట్ర దొంగ ఎట్టకేలకు దొరికాడు. అర్ధరాత్రి హైద్రాబాదులో ఆదోని పోలీసులను చూసి పరుగులు పెట్టిన మురళీని త్రీటౌన్‌ పోలీసులు వెంట పడి పట్టుకున్నారు.

దొంగ దొరికాడు
దొంగను మీడియాకు చూపుతున్న పోలీసులు

అర్ధరాత్రి హైద్రాబాదులో పట్టుకున్న పోలీసులు

ఆదోని రూరల్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): అంతర్‌రాష్ట్ర దొంగ ఎట్టకేలకు దొరికాడు. అర్ధరాత్రి హైద్రాబాదులో ఆదోని పోలీసులను చూసి పరుగులు పెట్టిన మురళీని త్రీటౌన్‌ పోలీసులు వెంట పడి పట్టుకున్నారు. ఆదోని పోలీసులను ఎస్పీ బిందు మాధవ్‌ అభినందించి, ఇలాంటి ఘటన పునరావృతం కాకూడదని నేరస్థుల విషయంలో జాగ్రత్తలను పాటించాలని సెట్‌ కాన్ఫరెన్స్‌లో సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మొహినాబాదు మండలం సూరగాలి గ్రామానికి చెందిన మురళీపై తెలంగాణ, ఆంధ్రాలో 70 కేసులు నమోద య్యాయి. 5వ తేదీన దొంగతనం కేసులో కోర్టుకు తరలిస్తుండగా, పోలీసుల కళ్లుగప్పి కోర్టు గోడదూకి పరారయ్యాడు. దీంతో ఆంధ్రజ్యోతి మంగళవారం కోర్టు గోడ దూకి, బుధవారం దొంగ దొరకలేదు... అనే కథనాలను ప్రచురించింది. ఎస్పీ సీరియస్‌ కావడంతో దొంగను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలు హైద్రాబాదుకు చేరుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి 12గంటలు దాటిన తరువాత మఫ్టీలో పోలీసులు మురళీ ఇంటికి చేరుకున్నారు. పోలీసులను గుర్తించిన దొంగ తన ఇంటి గోడ దూకి పరారయ్యాడు. పోలీసులు దొంగను వెంటాడి పట్టుకొని ఆదోనికి తరలించారు. దొంగను రిమాండ్‌కు తరలించామని సీఐ సూర్య మోహన్‌ రావు తెలిపారు.

Updated Date - Jan 09 , 2025 | 12:29 AM