అమరుల సేవలను స్మరించుకోవాలి: ఎమ్మెల్యే
ABN , Publish Date - May 17 , 2025 | 12:46 AM
దేశం కోసం ప్రాణాత్యాగాలు చేసిన సైనికుల సేవలు మరువలేనివని, వారిని స్మరించుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
పగిడ్యాల, మే 16 (ఆంధ్రజ్యోతి): దేశం కోసం ప్రాణాత్యాగాలు చేసిన సైనికుల సేవలు మరువలేనివని, వారిని స్మరించుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం విజయం సాధించడంతో పగిడ్యాల బస్టాండ్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆధ్వర్యంలో తిరంగ యాత్ర కార్యక్రమంలో బాగంగా మండల అధికారులు, వివిద శాఖల అధికారులు, వివిద గ్రామాలకు చెందిన ప్రజలు 500 మీటర్ల బారీ జాతీయ జెండాతో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. వీధుల గుండా భారత్ మాతాకు జై, అమరులైన జవాన్లకు జోహరులు అంటూ నినాదాలు చేశారు. అనతరం అమరులైన జవాన్ల ఆత్మకు శాతి చేకూరాలని మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమిత్రమ్మ, తహసీల్దార్ మధుబాబు, ఎంఈవో సుభాన్ తదితరులు ఉన్నారు.