రీసర్వే పనులు పకడ్బందీగా చేపట్టాలి
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:29 AM
గ్రామాలలో చేపట్టిన రీసర్వే పనులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదోని డివిజన సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ అన్నారు.

గోనెగండ్ల, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గ్రామాలలో చేపట్టిన రీసర్వే పనులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదోని డివిజన సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ అన్నారు. గోనెగండ్ల మండలం రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నికైనందున శుక్రవారం రీసర్వేకు సంబంధిం చిన అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. గ్రామంలోని రీసర్వే జరుగుతున్న పొలాల దగ్గరకు వెళ్లి రికార్డులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే సమ యంలో రైతులు అందుబాటులో ఉండి సర్వే పనులకు సహకరిం చాలని కోరారు. నిర్దేశించిన సమయానికి సర్వే పనుల పూర్తి చేయా లని సర్వే సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కుమారస్వామి, శిరీష, అబ్దుల్‌హమీద్, సిబ్బంది పాల్గొన్నారు.