కనీస పెన్షన రూ.9వేలు ఇవ్వాలి
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:30 AM
పెన్షనర్లకు కనీస పెన్షన రూ.9వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజి బాబు డిమాండ్ చేశారు.

ఈపీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): పెన్షనర్లకు కనీస పెన్షన రూ.9వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజి బాబు డిమాండ్ చేశారు. ఆల్ పెన్షనర్స్ అండ్ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన అధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్ను ధర్నాకు మద్దతుగా మంగళవారం నగరంలోని ఈపీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీఎస్‌ఎనఎల్ అసోసియేషన నాయకుడు యాకోబు అధ్యక్షత వహించగా అంజిబాబు మాట్లాడుతూ పెన్షనర్లకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలన్నారు. హయ్యర్ పెన్షన ఆప్షన అందరికీ వర్తింపజేయాలని, రైల్వే చార్జీలలో రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సామాజిక పింఛన రూ.3వేలు ఇస్తున్నా రని 20 నుంచి 30 సంవత్సరాలుగా పని చేస్తూ జమ చేసిన ఈపీఎఫ్ వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్న పెన్షన పెంచడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. నగరంలో బీఎస్‌ఎనఎల్, పేపర్‌మిల్, గ్లాస్ ఫ్యాక్టరీ, డెయిరీ, బిర్లా కంపెనీ, తదితర సంస్థలలో పని చేస్తూ రిటైర్డ్ అయిన వారికి కేవలం వేయి రూపాయలలోపు పెన్షన వస్తుందన్నారు. ప్రస్తుతం వచ్చే పెన్షన వైద్య ఖర్చులకు కూడా సరిపోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమా వేశాల్లో పెన్షనర్లకు నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో అసోసియేషన రాష్ట్ర కమిటీ సభ్యులు కె.సుధాకరప్ప, బీఎస్‌ఎనఎల్ నాయకులు మహేశ్వరరావు, నాయకులు జే.శంకర్‌రావు, మోహన, రామన్న, చంద్రశేఖర్‌రెడ్డి, మురళీ మోహ నరావు పాల్గొన్నారు.