వైద్యవృత్తి అత్యున్నతం
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:14 AM
వైద్యవృత్తి ఎంతో ఉన్నతమైందని అకడమిక్ డీఎంఈ డాక్టర్ జి.రఘునందన్ అన్నారు.

కేఎంసీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
250 మంది వైద్యులకు పట్టాల పంపిణీ
కర్నూలు హాస్పిటల్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): వైద్యవృత్తి ఎంతో ఉన్నతమైందని అకడమిక్ డీఎంఈ డాక్టర్ జి.రఘునందన్ అన్నారు. మంగళవారం సాయంత్రం కర్నూలు మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో 2019 బ్యాచ్ వైద్యవిద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా అకడమిక్ డీఎంఈ జి.రఘునందన్, రిటైర్డు ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వెంకటరంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా రఘునందన్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల విద్య తర్వాత వైద్య వృత్తిలో అడుగుపెడుతున్న వైద్యులకు అభినందనలు తెలిపారు. వైద్యులుగా రాణించాలని, వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్యవృత్తిలో విలువలు అత్యంత అవసరమని, విలువలతో కూడిన వైద్యాన్ని రోగులకు అందించాలన్నారు. ప్రిన్సిపాల్ చిట్టినరసమ్మ కొత్తగా వైద్యవృత్తిలో అడుగుపెడుతున్న వైద్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం విద్యార్థులకు ఎంబీబీఎస్ పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ సాయిసుధీర్, హరిచరణ్, ఏ.రేణుకాదేవి, బి.విజయానందబాబు తదితరులు పాల్గొన్నారు.
గోల్డ్ మెడల్ పొందిన వైద్యులు వీరే...
అనాటమి విభాగం : టి.హర్షిత
ఫిజియాలజి విభాగం : ధనారెడ్డి, లక్ష్మి, నరహరి రెడ్డి
బయోకెమిస్ర్టి విభాగం : టి.హర్షిత, జీజీ మానస
ఫార్మాకాలజి విభాగం : నవలూరి శ్రీనాగ ఈశ్వరి
పెథాలజి విభాగం : జీజీ మానస
మైక్రోబయాలజీ విభాగం : నాగలూరి శ్రీనాగ ఈశ్వర్
ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం : ధనిరెడ్డి, లక్ష్మి నరహరి రెడ్డి
ఈఎన్‌టీ అండ్ ఆప్తమాలజి విభాగం : కంచి జయశ్రీ, వైష్ణవి వర్మ
కమ్యూనిటీ మెడిసిన్ విభాగం : మద్దిపట్ల మనోజ్ నాయుడు
పీడీయాట్రిక్ అండ్ గైనిక్, జనరల్ మెడిసిన్, మైక్రోబయాలపి విభాగం : నాగలూరి శ్రీనాగ ఈశ్వర్
సర్జరీ విభాగం : ధనలక్ష్మి, లక్ష్మినరహరి రెడ్డి