Share News

వైభవంగా జగన్నాథ రథయాత్ర

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:04 AM

నారదముని భక్త బృందం ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగింది.

వైభవంగా జగన్నాథ రథయాత్ర
నందికొట్కూరులో జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న భక్తులు

నందికొట్కూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): నారదముని భక్త బృందం ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగింది. గురువారం సాయంత్రం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రారంభమై వాసవి కల్యాణ మండపం నుంచి పటేల్‌ సెంటర్‌ మీదుగా చౌడేశ్వరి దేవాలయం వరకు ఈ రథయాత్ర సాగింది. ఈ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:04 AM