Share News

వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠ

ABN , Publish Date - Nov 17 , 2025 | 12:18 AM

మండలంలోని మిట్టసోమాపురం గ్రామంలో అదివారం విగ్రహాల ప్రతిష్ఠ వైభవంగా జరిగింది.

వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠ
విగ్రహాలను ఊరేగిస్తున్న భక్తులు

నందవరం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని మిట్టసోమాపురం గ్రామంలో అదివారం విగ్రహాల ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. వేదపండితుడు సోమలగూడూరు శ్రీధర్‌ స్వామి ఆధ్వర్యంలో భైరవ, నందీశ్వర, నాగదేవత విగ్రహాలను ప్రతిష్ఠించారు. ముందుగా మహా గణపతి పూజ, పుణ్యాహవచనం, ిమాతృకలశం, రక్షణ బంధం, మహాయాగ మండల ప్రవేశం, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు విగ్రహాలను గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. కర్నూలు అర్చక పురోహితులు రాఘవేంద్రరావు, దినేష్‌ స్వామి పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2025 | 12:18 AM