Share News

వైభవంగా రామలింగేశ్వరుడి రథోత్సవం

ABN , Publish Date - Feb 28 , 2025 | 12:18 AM

సుప్రసిద్ధ శైవక్షేత్రమైన గురుజాలలో రామలింగేశ్వర స్వామి రథోత్సవం ఆశేష భక్త జనుల మధ్య గురువారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా రామలింగేశ్వరుడి రథోత్సవం
నందవరం మండలం గురజాలలో రథోత్సవానికి హాజరైన జనం

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

నందవరం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ శైవక్షేత్రమైన గురుజాలలో రామలింగేశ్వర స్వామి రథోత్సవం ఆశేష భక్త జనుల మధ్య గురువారం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిని ఆలయ నిర్వాహకులు, ఈవో రామ్‌ప్రసాద్‌, ఆర్చకులు హంపిస్వామి, వేదపండితులు టీడీపీ నాయకులు శివారెడ్డి సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మె ల్యే బీవీ హోమం కార్యక్రమం నిర్వహించారు. అనతరం అశేష జనవా హిని మధ్య రథోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం నుంచే వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఇసుకలింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొని రథోత్సవాన్ని తిలకించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐ మధుసూదన, ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు గురురాజారావు, రైస్‌మిల్‌ నారాయణరెడ్డి, కాశీంవలి, టీ ఈరన్న, జబ్బార్‌, వహబ్‌, బ్రహ్మనందరెడ్డి, గజేంద్రరెడ్డి, తిప్పారెడ్డి, సలీం, వైసీపీ నాయకులు నరసింహారెడ్డి, జాన పాల్గొన్నారు.

చంద్రమౌళీశ్వర స్వామి..

పెద్దకడుబూరు: మండలంలోని దొడ్డిమేకల గ్రామంలో వెలసిన చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహిం చారు. రథోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలో చిన్నారులు చేసిన కోలాటాల ప్రదర్శన ఆకట్టుకుంది. స్వామివారికి ఉదయం నుంచి ఆలయ అర్చకులు, జలాభిషేకం, కుంకుమార్చన, పుష్పాభి౉షేకం, మహామంగళహా రతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం చంద్రమౌళే శ్వరస్వామి రఽథాన్ని గ్రామస్థులు లాగారు. అలాగే పెద్దకడుబూరులో వెలసిన మల్లికార్జునస్వామి మహారథోత్సవాన్ని టీడీపీ రాష్ట్ర రైతు సం ఘం అధికార ప్రతినిధి రమాకాంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

తిమ్మప్ప స్వామి..

మంత్రాలయం: మండలంలోని రచ్చమర్రి గ్రామంలో తిమ్మప్ప స్వామి మహారథోత్సవం వైభవంగా నిర్వహించారు. గురువారం తిమ్మప్ప దూత దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వ హించారు. అనంతరం శివపార్వతుల కల్యాణం జరిపించారు. స్వామి వారిని పల్లకిలో ఏర్పాటు చేసి ఊరేగింపు చేసి అనంతరం రథోత్సవంపై శివపార్వతులు, శివలింగం చిత్రపటాలను అలంకరించి మహా ముఖద్వా రం గుండా వీధుల్లో ఊరేగించారు. రథం ముందుకు సాగుతుండగా.. కోలాటం, నందికోల సేవ నృత్యాలు, తప్పెట్లు, డీజే, బాణాసంచా కాలు స్తూ ఓం నమశ్శివాయ అంటూ రథాన్ని ముందుకు కదిలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోవిందమ్మ, సర్పంచ మేకల సుజాత ఎంపీ టీసీలు మజ్జిగ నరసమ్మ, కోసిగి జయలక్ష్మి, నాయకులు జెట్టి నరసిం హులు, యాగంటి వీరేష్‌, రోగెప్ప, మజ్జిగ బొజ్జప్ప, ఉప్పరి వెంకోబ, రవిరెడ్డి, జెట్టి వీరేష్‌, బుడ్డీర, మేకల నారాయణ, రామాంజనేయులు, గోవిందుగౌడు, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

కౌతాళం: మండల పరిధిలోని ఎరిగేరి గ్రామ పొలిమేరలో కొలువైన పులిగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి మరుసటి రోజున పులిగట్టు ఆంజనేయస్వామికి, రౌడూరు గ్రామంలోని జట్టేప్ప తాతకు ప్రత్యేక పూజల చేశారు. ఎరిగేరిలో గ్రామ ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. భక్తులు కొండ దిగువన స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం రౌడూరులో స్వామి వారి రథాన్ని లాగారు. సీఐ అశోక్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కమనీయం.. పార్వతీ పరమేశ్వరుల కల్యాణం

గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్లలో గురువారం సాయంత్రం గ్రామ శివార్లలో ఉన్న కాశీ విశ్వేశ్వరస్వామి దేవాయలంలో పార్వతి పరమేశ్వరుల కల్యాణం నిర్వహించారు. స్వామివారిని, అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం రుద్రాభిషేకం, పంచామృతా ఽభిషేకం నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, ఆకుపూజ, మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం సాయంత్రం 7గంటల సమయంలో పార్వతి పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఈశ్వరదేవాలయం నుంచి ఆంజనేయస్వామి దేవాలయం వరకు చిన్నారు పూర్ణ కలశాలతో ఊరేగించారు. అనంతరం అన్నతర్పణ కార్యక్రమం చేపట్టారు. రాత్రి భజన కార్యక్రమం నిర్వహించారు.

ఎమ్మిగనూరు రూరల్‌: మండలంలోని గుడికల్లు గ్రామంలో వెలసిన భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిం చారు. ముందుగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పండితులు కల్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా చిన్నారులు కలశాలతో స్వామి, అమ్మవార్లకు హారతి ఇచ్చారు. అనంతరం చిన్నారులు చేసిన కోలాటాల నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

Updated Date - Feb 28 , 2025 | 12:18 AM